జిల్లా నందు గతములో రేషను కార్డుదారులకు పంపిణీ చేయబడిన రేషను కార్డుల స్థానములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రొత్తగా స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మీడియాకు ప్రకటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ వివరాలు వెల్లడించారు.అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏటిఎం కార్డు పరిమాణంలో కార్డు ముందు వైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, కుటుంబ పెద్ద చిత్రం, చౌక ధరల దుకాణం సంఖ్య, QR కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ రైస్ కార్డులను రూపొందించడమైనది.