కూటమి ప్రభుత్వం కు వస్తున్న ప్రజాధరణ చూసి తట్టుకోలేకనే వైకాపా దుష్ప్రచారాలు చేస్తోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ అన్నారు ఆదివారం చిత్తూరు పార్టి కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వర్షాలు అప్పుడు అమరావతి మునిగిపోయింది అని తప్పుడు ప్రచారాలకు దిగారని 4. 5 లక్షలు పెన్షన్లు రద్దు చేసేసారంటూ అంగవైకల్యం ఉన్న వారి పెన్షన్లు రద్దు చేసేసారు అని తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని సైడ్ ఆర్టిస్టులు ఫేక్ ఆర్టిస్టులు ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.