ములుగు జిల్లా గోవిందరావు పేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావు పేట మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై ఇసుక లారీ ఢీ కొట్టడంతో నాలుగేళ్ల అక్కడికక్కడే నేడు గురువారం రోజున సాయంత్రం 5 గంటలకు మృతి చెందాడు. మృతుడు పస్రా గ్రామానికి చెందిన సాయి హర్ష (4) గా తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని, డ్రైవర్పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.