లంబాడీలపై అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు నాయకులు స్వయం బాబురావును పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలో గోర్ సేన లంబాడి హక్కుల పోరాట సమితి బంజారా సంఘాల ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో లంబాడీల ఓట్లతోనే గద్దెనెక్కిమని అనేక సభలలో ప్రకటించాలని గుర్తు చేశారు.