సోమవారం ఉదయం తెరుచుకున్న ఆలయాలు ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా నారాయణవనం, నాగలాపురం మండలంలో పలు ఆలయాలు మూసివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయం తెరిచి శుద్ధి చేసి, సంప్రోక్షణ అనంతరం ఆలయ అధికారులు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి నారాయణవనం కల్యాణ వేంకన్న, నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి, సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయాలు తెరుచు కున్నాయి.