యూరియా కోసం రైతుల ఆందోళనలకు దిగారు. జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. ఉమ్మడి తూప్రాన్ మనోహరబాద్ మండలాల్లో రైతులు రైతు వేదికల వద్ద అధికారులను రైతులు నిలదీశారు .ఇంకా ఎన్ని రోజుకు కాలయాపన చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో జాతీయ రహదారి 44 పై యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. దీనితో రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి 44ను రైతులు దిగ్బంధం చేసి ఇరువైపుల వాహనాలను నిలిపివేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.