Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 25, 2025
రంపచోడవరం ఏజెన్సీలో ఎస్సీ ఎస్టీ విద్యుత్తు వినియోగదారులకు 200 చదరపు అడుగుల ఇంటి స్లాబులలో స్థలం ఇచ్చినవారికి ప్రతి నెల 200 రూపాయలు అద్దెగా చెల్లించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్ట సింహాచలం పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు తమ యొక్క నివాసగృహాల స్లాబ్ పైన స్థలమును సోలార్ ప్లేట్లు అమర్చుటకు అంగీకరించిన యెడల ఏపీ ఈపీడీసీఎల్ వారి నుండి ప్రతి 200 చదరపు అడుగులకు నెలకు 200 రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తారన్నారు .