సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు కర్నూలులో సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఎన్నికల ప్రయోజనాలకు ఈ కేసును వాడుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.