తిరుమలలో టూ టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది అతని వద్ద నుంచి 3.5 లక్షలు విలువచేసే 15 సెల్ ఫోన్లు 20 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పాత సూర్యాపేటకు చెందిన కిషోర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు నకిలీ ఆధార్ కార్డు ఫేక్ ఫోన్ నెంబర్లతో లాకర్ను తీసుకొని చోరీలకు నిందితుడు పాల్పడేవాడని సి టైప్ క్వార్టర్స్ లో లాక్ చేసిన ఇంటి తలుపులను పగలగొట్టి 20 గ్రాముల బంగారు నగలు చోరీ చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తిరుమల టూ టౌన్ పోలీసులు తెలిపారు.