వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసం ను శనివారం అంగన్వాడిలు ముట్లడించారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే నెరవేర్చాలని ఆందోళన చేపట్టారు. ఆందోళన ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీలు మాట్లాడుతూ.. కనీస వేతనం 18000 రూపాయలకు పెంచకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుoది అన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీ న వేతనం వేతనం చెల్లించాలని, ఈ ఎస్ ఐ, పిఎఫ్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలో మంగమ్మ, యాదమ్మ, చిట్టి మ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు.