అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి హరి హరనాథ్ శర్మ బుధవారం వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి వారికి వేద ఆశీర్వచనం అందజేశారు.