నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్,ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో CT స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రివర్యులు ఆసుపత్రి లో అన్ని విభాగాలను పరిశీలించారు.ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం, జనగామ జిల్లా వైద్య అరోగ్య శాఖ అధికారులతో ఆసుపత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.