ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. మనిషిలా వచ్చి సైన్యమై ఎదిగి విజేతవై నిలిచి నాయకుడై గెలిచి మెరుపులా మెరిసి జన బహిల్యంలో దైవత్వమై ఎగసి కాగితాల మీదే శిధిలమైపోతున్న ప్రాజెక్టులకు ప్రాణం పోసి జనం భాష యాస ప్రయాస తెలుసుకున్న ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని నివాళులు అర్పిస్తూ ట్విట్టర్ చేశారు.