వరద ప్రాంతాల్లోని గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర సూచించారు. పాసర్లపూడిలంక శ్రీరామ్ పేటలో 9 నెలలు నిండిన ఆదిలక్ష్మిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వరద ప్రభావిత ప్రాంతంలోని రెండు వైద్య శిబిరాలను పరిశీలించారు. ముంపు బాధితులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.