కళ్యాణదుర్గం మండలం పాపం పల్లి గ్రామ సమీపంలోని చెక్ డ్యామ్ ను మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చెక్ డ్యామ్ కు ఏర్పాటు చేసిన రాళ్లు మొత్తం ధ్వంసం చేశారు. గమనించిన గ్రామస్తులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.