ఆకేరు వాగులో దూకి గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం వీరారం గ్రామంలో విషాదం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన చిలుముల మునీష్ అనే 25 సంవత్సరాలు యువకుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం సమీపంలోని తండాలో భూత వైద్యుని దగ్గరికి వెళుతున్న క్రమంలో ఆఖరి వాగులో దూకి గల్లంతయ్యాడు గత రెండు రోజులుగా మృతదేహం లభ్యం కాలేదు ఈరోజు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మునిష్ మృతదేహాన్ని బెస్ట్ టీం కనుగొన్నారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు