సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీలు గ్రంధాలయాలకు చెల్లించాల్సిన గ్రంథాలయ సెస్ లను చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేటలోని గ్రంథాలయంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గ్రంథాలయాలకు రెండు కోట్ల వరకు మున్సిపల్ సెక్స్ రావాల్సి ఉందని మున్సిపాలిటీలు చెల్లించాల్సిన 8% సెస్ ను త్వరగా చెల్లించి గ్రంధాలయాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.