ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇటీవలే రొమ్ము క్యాన్సర్ చికిత్స పొందిన మహిళలను మంత్రి సీతక్క నేడు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు పరామర్శించారు. మహమ్మద్ గౌస్ పల్లి, బండారుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళలకు వైద్యులు రొమ్ము క్యాన్సర్ నిర్ధారించి, విజయవంతంగా సర్జరీ చేశారని మంత్రి సీతక్క అన్నారు. గతంలో క్యాన్సర్ చికిత్స కోసం వ్యయ, ప్రయాసాలతో పడేవారని, కానీ ములుగు లోనే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రలో ఈ సదుపాయం కలదని అన్నారు.