భీమవరం మెంటేవారితోటలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రక్తదాన శిబిరం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు గోపిశెట్టి మురళీ కృష్ణారావు రక్తదాతలకు మెమోంటోలు, సర్టిఫికెట్లను అందజేశారు. భక్తితో పాటు రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.