ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12, 13 తేదీలలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆటో కార్మికుల జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.30 వేలు జమ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులతో ఆటోలను అనుసంధానం చేసి తమకు ఉపాధి కల్పించాలని కోరారు. బంద్ ను విజయవంతం చేయాలని ఆటో కార్మికులను ఆయన కోరారు