సహజ ఎరువులు మరియు నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ములకలచెరువు మండలం సోంపల్లి లో నానో ఎరువులు, జీవన ఎరువులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్