అనంతపురం నగరంలో ఆదివారం రాత్రి జరుగుతున్న వినాయక విగ్రహాల ఊరేగింపులను జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సప్తగిరి సర్కిల్ టవర్ క్లాక్ పాతూరు రామ్ నగర్ తదితర ప్రాంతాలలో జరుగుతున్న వినాయక విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన నగర శివారు ప్రాంతాలలో వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేసిన స్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.