ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణంతో జీవన ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలంటే గురువారం గాజువాక నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేస్తూ ఆటోలను ఆపివేశారు. ఉచిత బస్సు కారణంగా ఆటో డ్రైవర్లు రోడ్డుని పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆటో వర్కర్లకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికులకు తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు.