నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చిత్తూరు జిల్లాలో శనివారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. స్వస్థలాలకు వచ్చి డీలర్, వీఆర్వోల సమక్షంలో కార్డులు పొందాలని సూచించారు. బయోమెట్రిక్ వేసిన అనంతరం కార్డులు అందజేస్తామన్నారు. జిల్లాకు 5.26 లక్షల స్మార్ట్ కార్డులు వచ్చినట్టు వెల్లడించారు.