సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2006- 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత పాఠశాల విద్యార్థులంతా ఒకచోట చేరి పూర్వజ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు .చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకొని ప్రస్తుతం ఒకరికి ఒకరు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహభావంగా ఉంటూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉండే విధంగా కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశంతో పూర్వ విద్యార్థులంతా ఒక చోటికి చేరినట్లు తెలిపారు.