సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసిఫాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు,