హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. శనివారం నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.