అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గురువారం రాత్రి 7 గంటల సమయంలో మీడియాకు ఒక కీలక ప్రకటన చేశారు.పామిడి మండలం G. కొట్టాల గ్రామానికి చెందిన దేవన సతీష్ , పామిడి నుండి తన గ్రామానికి బైక్ లో వెళుతుండగా కాలాపురం గ్రామ సమీపంలో తన మోటర్ సైకిల్ మీద నుండి రోడ్ పై అనుమానాస్పద స్థితిలో పడి మృతి చెంది ఉండడం గమనించామన్నారు.మోటర్ సైకిల్ ముందు భాగం కూడా పూర్తిగా పగిలిపోయి ఉన్నదని అన్నారు. సమాచారం అందిన వెంటనే జాప్యం లేకుండా క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపి సంఘటనా స్థలంలో విచారణ చేశామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పామిడి ఏరియా హాస్పిటల్ లో ఉంచామన్నారు.