సూపర్ సెక్స్ సూపర్ హిట్ అంటూ టిడిపి కూటమి పార్టీలు బుధవారం అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడం హాస్యాస్పదం అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చేటందుకు సూపర్ సిక్స్ హామీలు ప్రధాన కారణమని, అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినప్పటికీ సూపర్ సెక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని తులసి రెడ్డి అన్నారు .