కార్వేటినగరం మండలంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎంపీడీవో చంద్రమౌళి కోరారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలిద్దామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.