ఆదివారం రోజున మేడ్చల్ జిల్లా,నాగారం మున్సిపాలిటీ ప్రశాంత్నగర్లో ఉంటున్న జంభాపురం నారాయణరెడ్డి (70) గుండెపోటుతో మృతి చెందగా భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఇందిర (65) అరగంటలోనే ప్రాణాలు విడిచారు. భర్త మృతి చెందిన అరగంటలోనే భార్య సైతం మృతి చెందడంతో ప్రశాంత్ నగర్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.