అనంతపురం నగరంలోని సాయి నగర్ మొదటి క్రాస్ లో పూజారి స్వాతి అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నే ప్రధాన కారణం అంటూ పోలీసులు వెల్లడించారు. తనతో పాటుగా పనిచేస్తున్న అరుణ్ కుమార్, ప్రతిభ భారతీలు లవ్ చేసుకుంటున్నారు. వారి మధ్యలో ఈమె అడ్డు రావడంతో ఆమెకు సోమవారం ఉదయం ఇద్దరూ ఫోన్ చేసి తమ జీవితంలోకి నువ్వు రావద్దని నువ్వు చనిపోతే మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పారు. దీంతో మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.