యూరియా కోసం బారులు తీరుతున్న రైతులు.. పంటలు ఎర్రబడుతున్నాయని ఆవేదన... ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వేసిన పంటలు ఎర్రబడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. శంకరపట్నం మండలం మెట్పల్లి సహకార సంఘానికి శనివారం యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు తెల్లవారుజామునే గోదాం వద్ద వరుస కట్టారు. రైతు వద్ద నుంచి ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్ తీసుకొని ఒక రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. తమకు ఇచ్చే యూరియా బస్తాల సంఖ్యను పెంచాలని రైతులు కోరుతున్నారు.