జిల్లా వ్యాప్తంగా ఎంపికైన గ్రామ పాలన అధికారులకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో గ్రామ పాలన అధికారులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాలన అధికారులు పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించి, గ్రామీణాభివృద్ధి దిశగా కృషి చేయాలని