నంద్యాల జిల్లా బేతంచెర్లలో బనగానపల్లె రహదారిపై రైల్వే గేటు మరమ్మతు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ట్రైన్ సమయంలో పనిచేయని గేటును కార్మికులు విడదీసి పనులు చేస్తున్నారు. దీంతో పాఠశాలకు, పనులకెళ్లే ప్రజలు నిరీక్షించాల్సి వస్తోంది. ఇకనైనా ఈ రహదారికి బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.