కొన్ని సంవత్సరాలుగా ఆర్గనైజర్లు, కంపెనీలు, రాజకీయ నాయకులు సీడ్ పత్తి రైతులను మోసం చేస్తున్నారని నియోజకవర్గ ఇన్చార్జ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయకుమార్ ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్వాల జిల్లాలో రైతులు సీడ్ పత్తి విత్తనాలు పాసైనప్పటికీ ఫెయిల్ అయినట్లు కంపెనీలు మోసం చేస్తున్నాయని అన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని సూచించారు..