కుందుర్పి మండలం ఎన్ వెంకటాంపల్లి గ్రామంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా అగ్రవర్ణాలు, దళిత వర్గాల మధ్య వివాదం తలెత్తింది. మా విగ్రహం ముందు పోవాలంటే మా విగ్రహం ముందు పోవాలని ఇరువర్గాల వారు పట్టుపట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాలను అక్కడ నుంచే చెదరగొట్టారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అగ్రవర్ణాలకు చెందిన వినాయకుని ముందు పంపించారని దళితులు ఆరోపించారు. దళితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.