చేగుంట మండల కేంద్రానికి శనివారం యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు తరలివచ్చారు, వేలాది మంది రైతులు టోకెన్ల కోసం తరలిరావడంతో ప్రత్యేక పోలీస్ బలగాల పహారాలో రైతులకు యూరియా టోకెన్లను అందజేశారు, మహిళా రైతుల సైతం పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది పలువురు మహిళా రైతులకు స్వల్ప గాయాలయ్యాయి, రాత్రి మూడు గంటల నుండి సుమారు కిలోమీటర్ మేర భారీ వరుసలో చెప్పులు చెట్ల కొమ్మలు పెట్టి వరుసలో పెట్టి నిలబడ్డారు, వారు మాట్లాడుతు గత 4 యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని ఆరోగ్య పరిస్థితులు బాగా లేకుంన్న యూరియా కోసం వరుసలో నిలబడ్డామన్నారు.