ఆళ్లగడ్డలోని సత్రం వీధిలో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణేశ్ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఉత్సవ కమిటీ సభ్యుడు ఋషికేశ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది భక్తులు, దాతలు సహకారంతో రూ.70 వేల విలువ చేసే శ్రీ గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నారు. వేద పండితులు బాలసుబ్రమణ్య శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు.