ఆపదలో ఉన్నవారికి సంజీవినిల ఆదుకునేందుకు అత్యాధునిక వసతులు కలిగిన నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మంగళవారం ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం పేదవాడికి వైద్య, విద్య సేవలు అందించడంలో రాజీ పడదన్నారు. అనంతరం 108 సిబ్బంది సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు.