పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో కుళ్లిన పండ్లతో ఫ్రూట్ జ్యూస్లను తయారు చేస్తున్న షాపులపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో శానిటరీ సెక్రటరీలు తదితరులు దాడులు నిర్వహించారు. జైపూర్ రోడ్, మెయిన్ రోడ్, చిన్న బజార్ ప్రాంతాల్లో ఫ్రూట్ జ్యూస్ షాపులపై దాడులు నిర్వహించారు. పాడైన పండ్లతో జ్యూసులు తయారు చేస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.