కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం వినాయక చవితి పండగ పురస్కరించుకుని ఏర్పాటుచేసిన మండపాల్లో కొలువు తీర్చిన గణేశుని విగ్రహాలను ఐదవ రోజు నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా గణనాధునికి మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యువకులు, మహిళలు డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ ....ఈ ఏడాదికి వెళ్లి..మళ్లీ తిరిగి రావయ్యా మా బొజ్జ గణపయ్య అంటూ జై నాయక.. జై జై నాయక నినాదాలతో బొజ్జ గణపయ్యకు గ్రామోత్సవం నిర్వహించి భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలిస్తున్నారు.