కోవూరు: రెండో రోజు అరుణ విచారణ పూర్తి కోవూరు పోలీస్ స్టేషన్లో నిడిగుంట అరుణ రెండో రోజు విచారణ పూర్తయింది. అడిషనల్ ఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు చేసి నెల్లూరు జైలుకు తరలించారు. కోవూరు పోలీస్ స్టేషన్లో అరుణపై వచ్చిన ఫిర్యాదులపై విచారించినట్లు సమాచారం.