Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 27, 2025
రంపచోడవరంలో ఈనెల 22వ తారీఖున జరిగిన ఆది కర్మయోగి యాక్టివిటీపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 22వ తారీఖున యూత్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన యాక్టివిటీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ వారిని, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారిని యం. సావిత్రిని నియమించడం జరిగిందని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు.