రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని దివ్యాంగులు, వృద్ధులు ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ నాయకులతో కలిసి సంయుక్తంగా సోమవారం మధ్యాహ్నం ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు 6000 చేయూత పింఛన్ 4000 తీవ్ర వైకల్యం ఉన్నవారికి 15000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న పెన్షన్లను విడుదల చేసి స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు.