రాష్ట్రంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి రైతులను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేస్తే చంద్రబాబు నాయుడు దండగ అంటున్నారని పేర్కొన్నారు.