ఉమ్మడి నల్లగొండ వ్యాప్తంగా దేవాలయాలు తెర్చుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా జిల్లాలో మూసివేయబడిన ఆలయాలు తిరిగి తెర్చుకున్నాయి. రాత్రి 9:56 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటి 1.26 గంటల వరకు గ్రహణం కొనసాగింది గ్రహణాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టు ధర్వేశిపురం సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి ఆలయంతో పాటు పాలు దేవాలయాలను ఆదివారం మధ్యాహ్నం 12.25 గంటలకు మూసివేశారు .సోమవారం 3.30 గంటలకు ఆలయాలను తెరిచారు.5.30 సుప్రభాతం సేవా కార్యక్రమాలను నిర్వహించారు.