బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ బాధితులను వేధిస్తున్నాయని వారికి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రేపల్లె ఐ ఐ హెచ్ ఎఫ్ ఎల్ బ్రాంచ్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సంస్థపై చర్యలు తీసుకోవాలని రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.