నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమల్లలో సోమవారం రాత్రి ఎస్సై రమణయ్య ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమణయ్య మాట్లాడుతూ.. గ్రామాలలో ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రజలందరూ కలిసి మెలిసి జీవించాలని సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మద్యం పేకాట, మట్కా తదితర జూదములకు దూరంగా ఉండాలని అన్నారు.