కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిదిలోని కొండాపురం మండలంలోని శ్రీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.289 టీఎంసీలు నీటినిల్వ ఉన్నట్లు బుధవారం జలాశయ అధికారులు తెలిపారు. గండికోట జలాశయంలోనికి జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా పదివేల 500 క్యూసెక్కులు, క్యాచ్ మెంట్ ద్వారా 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. గండికోట జలాశయం నుండి మైలవరం రిజర్వాయర్ కు 5000 క్యూసెక్కులు, సిబిఆర్ లిఫ్ట్ స్కీంకు 500 క్యూసెక్కులు, డ్రింకింగ్ స్కీముకు 20 క్యూసెక్కులు, జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ కు 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు.